BGT 2024-25 : ఆస్ట్రేలియా పర్యటన అంటే చాలు పేస్ పిచ్‌ల గురించిన చర్చే వస్తుంది. ఊహించని బౌన్స్, పేసర్లకు అనుకూలించే పరిస్థితులు ఇవే కండ్ల ముందు మెదులుతాయి. ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్దమైన భారత జట్టు (Team India)కు మునపటి మాదిరిగానే పేస్ పిచ్‌లు స్వాగతం పలకనున్నాయి. స్వదేశంలో మరోసారి వికెట్ల పండుగ చేసుకునేందుకు ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సారథ్యంలోని పేస్ బలగం కాచుకొని ఉంది.
తొలి టెస్టుకు వేదికైన పెర్త్ మైదానంలోని పిచ్ ఫొటోలను సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. టీమిండియా ఆటగాళ్లు ఊహించినట్టే పిచ్ మీద భారీగా పశ్చిక కనిపిస్తోంది. భారత్, ఆసీస్‌ల మధ్య పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ మొదలయ్యేందుకు ఇంకా నాలుగు రోజులు ఉంది. నవంబర్ 22న ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి.
ఇప్పటికే పచ్చికతో భయపెడుతున్న పిచ్ మీద క్యురేటర్ ఇంకా నీళ్లు పోయిస్తూ.. గడ్డని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో, ఆస్ట్రేలియా పేసర్లకు అనుకూలించేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నారని అర్థమవుతోంది.
‘ఎప్పటిలానే పెర్త్ పిచ్‌ను పేసర్లకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నాం. కనీసం 10 మిల్లీమీటర్ల పరిమాణంలో గడ్డి ఉండేలా చూస్తున్నాం. పిచ్ అలా ఉంటే మా పేస్ దళానికి పరిస్థితులు బాగా సరిపోతాయి’ అని హెడ్ క్యురేటర్ ఇసాక్ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. గత పర్యటనలో ఇదే పిచ్ మీద టీమిండియాను 36 పరుగులకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా పేసర్లు ఈసారి కూడా అదే తరహాలో చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు.
This is Classic!
Pakistan tried to get out on 36. Not possible!
What a Record for Team 36 🇮🇳#PAKvsAUS #INDvAUS— Jalaad 🔥 حمزہ (@SaithHamzamir) November 14, 2024
మరోవైపు భారత క్రికెటర్లు గత అనుభవాల నేపథ్యంలో పేస్ పిచ్‌కు తగ్గట్టే సాధన చేస్తున్నారు. మాజీ సారథి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్.. జడేజాతో సహా అందరూ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుర్ర పేసర్లు ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రానా బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో కలవకపోవడంతో పేసర్ బుమ్రా తొలి టెస్టుకు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్ కాంబినేషన్, శుభ్‌మన్ గిల్ గాయం, మూడో పేసర్‌గా ఆడేది ఎవరు? అనే విషయాలపై స్పష్టత రానుంది.
🚨 1st look at Perth Pitch
Pitch for Perth Test is looking greeny & juicy, gonna help pace bowlers alot. And to make things worse for batters, there will be overcast conditions through out the game. I can see India getting all out under 50.
P.S – Poor BCCI can only dream of… pic.twitter.com/KfpNyivpcj
— Rajiv (@Rajiv1841) November 18, 2024