Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి రాబోతున్న చివరి సినిమా దళపతి 69 (Thalapathy 69). హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. దళపతి 69 షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అభిమానులు విజయ్ను కలిసేందుకు సెట్స్ దగ్గరకు భారీగా తరలివచ్చారు. విజయ్ జీన్స్, ఫుల్ షర్ట్ కాంబోలో గాగుల్స్ పెట్టుకొని.. సూపర్ కూల్‌గా కనిపిస్తూ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ దళపతి 69లో ఎలాంటి లుక్‌లో కనిపించబోతున్నాడనే దానిపై హింట్ ఇచ్చేస్తున్న వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
దళపతి 69లో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దళపతి 69 2025 దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దళపతి 69 ఓవర్సీస్ థ్రియాట్రికల్ రైట్స్ ది గోట్, లియో చిత్రాలను బీట్ చేసి రూ.78 కోట్లు పలికాయన్న వార్త ఇప్పటికే అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
Another Video Of @actorvijay From Today’s Shooting Spot 🔥 @tvkvijayhq #Thalapathy69 pic.twitter.com/RvJMJqFzno
— Arun Vijay (@AVinthehousee) November 17, 2024
From the sets of #Thalapathy69 🔥🔥
— Vijay Fans Trends (@VijayFansTrends) November 17, 2024
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!