IPL 2024 | మర్క్రమ్పై వేటు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కమిన్స్
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)లో మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్టుగానే ఎడెన్ మర్క్రమ్(Aiden Markram)పై...
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)లో మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి టైటిల్‌పై కన్నేసిన హైదరాబాద్ ఎడెన్ మర్క్రమ్(Aiden Markram)పై వేటు వేసింది. అందరూ ఊహించినట్టుగానే ప్యాట్ కమిన్స్(Pat Cummins)ను కెప్టెన్ చేసింది.
ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు కట్టబెట్టిన కమిన్స్‌కు పగ్గాలు అప్పగిస్తున్నట్టు సోమవారం ఎస్ఆర్హెచ్ ప్రకటించింది. ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. 17వ సీజన్లో హైదరాబాద్‌తో పాటు పలు జట్లు కొత్త సారథులను నియమించాయి. శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే.
#OrangeArmy! Our new skipper Pat Cummins 🧡#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
కెప్టెన్లు మారినా…
దక్షిణాఫ్రికా ఆటగాడు ఎడెన్ మర్క్రమ్ 16వ సీజన్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఓపెనింగ్ కాంబినేషన్, మిడిలార్డర్ వైఫల్యం వెరసి వరుస ఓటములతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. 2016లో డేవిడ్ వార్నర్(David Warner) సారథ్యంలో టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఆ తర్వాత కేన్ విలియమ్సన్, మర్క్రమ్.. ఇలా కెప్టెన్లు మారినా మరో టైటిల్ కొట్టలేకపోయింది. గత సీజన్లో తీవ్రంగా నిరాశ పరిచిన తమ జట్టు రాతను కమిన్స్ మారుస్తాడని ఆరెంజ్ ఆర్మీ ఎంతో నమ్మకంతో ఉంది.

అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా పునఃవైభవానికి ప్యాట్ కమిన్స్ నాంది పలికాడు. టిమ్ పైన్ నుంచి 2022లో టెస్టు పగ్గాలు అందుకున్న అతడు ఆసీస్‌కు నిరుడు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) గదతో పాటు వన్డే వరల్డ్ కప్(ODI World Cup)ట్రోఫీ గెలిచింది. అందుకనే 17వ సీజన్ మినీ వేలంలో అతడి కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.20.50 కోట్లు పెట్టింది.
Mark your dates, #OrangeArmy 😍
We start our 🔥 days against the Knights 🧡💜
And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE
— SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024
వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ (Travis Head)ను కూడా హైదరాబాద్ కొన్నది. ఈసారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
- Anant – Radhika | అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్.. డాన్ రోల్లో ముఖేష్ అంబానీ.. వీడియో వైరల్
- Dharmashala Stadium | ధర్మశాలలో వడగండ్లు, ఎముకలు కొరికే చలి.. ఐదో టెస్టుకు అంతరాయం తప్పదా..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

