Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Invited for Bihu, then attacked | దుర్గా మాత పూజ వేడుకల్లో ప్రదర్శన కోసం బిహు బృందాన్ని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆ బృందం అస్సామీ పాటలు వాయించడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యలో హింస చెలరేగడంతో బిహు కళాకారులపై ఒక గుంపు దాడి చేసింది.
గువాహటి: దుర్గా మాత పూజ వేడుకల్లో ప్రదర్శన కోసం బిహు బృందాన్ని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆ బృందం అస్సామీ పాటలు వాయించడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యలో హింస చెలరేగడంతో బిహు కళాకారులపై ఒక గుంపు దాడి చేసింది. అలాగే వారి సాంప్రదాయ సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశారు. (Invited for Bihu, then attacked) ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. అస్సాంలోని శ్రీభూమి (గతంలో కరీంగంజ్) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 24, దుర్గా మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపును హిందుస్థాన్ క్లబ్ నిర్వహించింది. ఈ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు 11 మంది సభ్యుల బిహు బృందాన్ని నిర్వాహకులు ఆహ్వానించారు.
కాగా, బెంగాలీ ప్రాబల్యం ఉన్న బరాక్ వ్యాలీలో బిహు బృందం అస్సామీ పాటలు వాయించడాన్ని ఒక వర్గం అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో బిహు కళాకారులు, ఆ వర్గం మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో బిహు కళాకారులపై నిర్వాహకులు దాడి చేశారు. వారిని కొట్టడంతో పాటు సాంప్రదాయ బిహు వాయిద్యాలను ధ్వంసం చేశారు. కొన్ని వాయిద్యాలను ఎత్తుకెళ్లారు. ఒక యువ ప్రదర్శనకారుడికి చెందిన బంగారు గొలుసును కూడా దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఈ ఘర్షణ సమచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఊరేగింపు నిర్వహించిన హిందుస్థాన్ క్లబ్‌కు చెందిన 13 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో నలుగురిని అరెస్ట్ చేయడంతో ఈ సంఖ్య 17కు చేరింది. అయితే తొలుత అరెస్ట్ చేసిన 13 మంది నిందితులకు వేగంగా బెయిల్ మంజూరు కావడంపై అస్సాం కాంగ్రెస్ ప్రశ్నించింది.
అయితే బరాక్ లోయలో దశాబ్దాలుగా ఉన్న అస్సామీ-బెంగాలీ భాషా విభజన ఆందోళనలను ఈ సంఘటన మళ్లీ రేకెత్తించింది. 1961లో ఈ ప్రాంతంలో భాషా ఉద్యమం వల్ల రక్తపాతం జరిగింది. ఆ తర్వాత ఈ రెండు వర్గాల మధ్య దశాబ్దాలుగా శాంతియుత సహజీవనం నెలకొన్నది. బరాక్, బ్రహ్మపుత్ర వర్గాల మధ్య విభేదాలకు దారి తీసిన ఈ దాడిని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఖండించారు. బిహు బృందంపై దాడి చేసిన వారిని శిక్షించాలని అస్సాంలోని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

