Anant Ambani – Radhika Merchant | అపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రీడా, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు కూడా తరలివచ్చారు. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుక రెండో రోజు ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మూడో రోజు సంగీత్ వేడుకలలో ముఖేష్ డాన్ పాత్రలో అలరించాడు. ”డాన్‌ను పట్టుకోవడం కష్టమే కాదు. అసంభవం కూడా అనే డైలాగ్‌తో ముఖేష్ డాన్ పాత్రలో ఉండగా.. నీతా అంబానీ వచ్చి ఈ డాన్ (ముఖేష్) పట్టుబడ్డాడు. ముఖేష్ లేట్ అవుతుంది వెళ్దాం పద. మన చిన్నోడు అనంత్ సంగీత్ ఈరోజు అంటూ నీతా అనగానే.. ముఖేష్ ఎస్ బాస్ అంటూ అనడం ఫుల్ ఎంటర్టైన్గా సాగింది.
Don #NeetaAmbani 😎#AmbaniWedding #MukeshAmbani pic.twitter.com/gfU5b4UmR8
— Ashwani kumar (@BorntobeAshwani) March 3, 2024