Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Water Tankers | సాగునీటి సమస్య, కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడడానికి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులు ఎలాంటి పాట్లు పడుతున్నారో మరోసారి కండ్లకు కట్టినట్టు చూపించే వీడియో బయటకు వచ్చింది.
Water Tankers | ఓ వైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు కరెంట్ కోతలు, ఇంకోవైపు సాగు నీరు అందక రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఎంతో కష్టపడి వేసిన వరి పంట పొట్టచేతకొచ్చే దశలో ఎండిపోతుండటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో చేసేదేమీ లేక జనరేటర్ల సాయంతో వరిని పారిస్తూ కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే కొందరు రైతులు నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పశువులకు మేతగా వదిలేసి కన్నీరుమున్నీరవుతుండగా.. మరికొందరేమో వరిని తగలబెడుతున్నారు. సాగునీటి సమస్య, కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడడానికి రైతులు ఎలాంటి పాట్లు పడుతున్నారో మరోసారి కండ్లకు కట్టినట్టు చూపించే వీడియో బయటకు వచ్చింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివారులో రైతు స్వామి ఎండిపోతున్న తన వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి పొలంలో పారిస్తున్నారు. రెండు ట్యాంకర్ల నీటితో పొలాన్ని నీరు పారిస్తున్న వీడియో రైతుల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.
సాగునీటి సమస్య, కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలను కాపాడడానికి రైతుల విశ్వప్రయత్నాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివారులో ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి పొలంలో పారిస్తున్న రైతు స్వామి https://t.co/TENrrMIDAC
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

