Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Modi Ka Baap Bhi Jayega: మోదీ కా బాప్ బీ జాయేగా అంటూ ఆదివారం ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఖర్గే దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: పాట్నాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjung Kharge) మాట్లాడుతూ ప్రధాని మోదీని విమర్శించారు. ఆ క్రమంలో మోదీ నాన్న కూడా ఓడిపోతాడని అన్నారు. మోదీ కా బాప్ బీ జాయేగా (Modi Ka Baap Bhi Jayega)అని స్టేజ్‌పై ఖర్గే అరిచారు. దీన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఖర్గే దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రధాని మోదీ దివంగత తండ్రిని దూషించినందుకు ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖర్గే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద ఇవాళ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాట్నా, జమ్మూ, ఢిల్లీలో ఖర్గే దిష్టబొమ్మలను దహనం చేసి నినాదాలు చేశారు. బెంగుళూరులోని ఫ్రీడం పార్క్‌లో ఖర్గేకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన జరిగింది. ఖర్గే వ్యాఖ్యలతో తాను షాకైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను సాధారణ కాంగ్రెస్ నేత చేయలేదన్నారు.
రాహుల్ గాంధీ అపరిపక్వత గురించి అందరికీ తెలుసు అని, కానీ బ్యాడ్ కంపెనీ వల్ల పార్టీలోని ఇతర వ్యక్తులకు కూడా ఆ వ్యాధి సోకినట్లు అర్థమవుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.
Kharge gets furious after he got a reality check in his own event!!
A congress supporter who was present at the event said “Modi Kahi nahi Jaega”
Kharge got so furious that he attacked Modi Ji’s Dead father!! https://t.co/7ie4gfT6zd
— Rohit (@Iam_Rohit_G) October 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

