IPL 2025 : ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్. పవర్ ప్లే తర్వాత వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న ఆయుష్ మాత్రే(32), షేక్ రషీద్(19)లు పెవిలియన్ చేరారు. స్పిన్నర్లు శాంట్నర్, విల్ జాక్స్ రంగంలోకి దిగడంతో చెన్నై స్కోర్ వేగం తగ్గింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(9), శివం దూబే(2)లు క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు చెన్నై 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు అశ్వనీ కుమార్ షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే డేంజరస్ రచిన్ రవీంద్ర(5)ను ఔట్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు. అయితే.. అరంగేట్రం చేసిన ఆయుష్ మాత్రే(32) ఆ ఓవరలో వరుసగా 4, 6, 6 బాది తన తడాఖా చూపించాడు. దాంతో, చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది.
𝙁𝙚𝙖𝙧𝙡𝙚𝙨𝙨 𝙖𝙣𝙙 𝙁𝙡𝙖𝙢𝙗𝙤𝙮𝙖𝙣𝙩 🤩
How about that for a start 🔥
Ayush Mhatre’s #TATAIPL career is up and away in some fashion 💛#CSK 52/1 after 6 overs.
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#MIvCSK | @ChennaiIPL pic.twitter.com/UVvmdWotvY
— IndianPremierLeague (@IPL) April 20, 2025
ఆ తర్వాత చాహర్‌ను ఉతికేస్తూ రెండు ఫోర్లు సాధించిన మాత్రే.. పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద శాంట్నర్ చేతికి చిక్కాడు. ఆ కాసేపటికే శాంట్నర్ ఓవర్లో షేక్ రషీద్(19) ఫ్రంట్ ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 63 వద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.