IPL 2026 : ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో సంజూ శాంసన్ (Sanju Samson)ను దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఏకంగా 10 మందిని వదిలేసింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరొక్క సీజన్ మాత్రమే ఆడనున్న నేపథ్యంలో చెన్నై భావి సారథిగా సంజూను నియమిస్తారనే వార్తలు వినిపించాయి. పద్దెనిమిదో సీజన్ ముందు కెప్టెన్సీ చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను తప్పించి.. శాంసన్‌కు పగ్గాలు అప్పగిస్తారనే కథనాలు వస్తున్నాయి. అయితే.. ఇవన్నీ గాలివార్తలే అంటోంది సీఎస్కే ఫ్రాంచైజీ.
పంతొమ్మిదో సీజన్ కోసం అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను శనివారం వెల్లడించిన చెన్నై.. ఒక్క పోస్ట్‌తో వదంతులకు చెక్ పెట్టింది. ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ బదలాయింపు ఉండదని.. రుతురాజే తమ నాయకుడని ధ్రువీకరించింది ఫ్రాంచైజీ. గత ఎడిషన్ ఆరంభం మ్యాచ్‌కు ముందే ధోనీ వారసుడిగా ఎంపికైన గైక్వాడ్.. అనూహ్యంగా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం ఇండియా ఏ తరఫున ఆడుతున్న అతడు శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ ముందు ఫామ్ అందుకున్న గైక్వాడ్.. ఈసారి టైటిల్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.
LEAD THE WAY, CAPTAIN RUTURAJ GAIKWAD!💪🦁#WhistlePodu pic.twitter.com/EawvX5k2yI
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
గత సీజన్లో దారుణంగా ఆడిన ఆటగాళ్లపై వేటు వేసింది చెన్నై యాజమాన్యం. కోట్లు ఆర్జిస్తూ.. జట్టుకు ఉపయోగపడని వాళ్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండడం గమనార్హం. అబుధాబీ వేదికగా డిసెంబర్ 16న జరిగే వేలంలో చెన్నై ఫ్రాంచైజీ బృందం రూ.43.4 కోట్ల పర్స్‌తో హాజరుకానుంది.
చెన్నై సూపర్ కింగ్స్ : రీటైన్డ్ ప్లేయర్లు – ఎంఎస్ ధోనీ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, నాథ్ ఎల్లిస్, అన్షుల్ కంబోజ్, ముకేశ్ చౌదరీ, రామక్రిష్ణ ఘోష్, సంజూ శాంసన్(ట్రేడ్ డీల్), రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
సీఎస్కే వద్దనుకున్న ప్లేయర్లు – డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, షేక్ రషీద్, విజయ్ శంకర్, కమలేశ్ నగర్కోటి, వన్ష్ బేడీ, ఆండ్రూ సిద్ధార్థ్.