Bharat Arun: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) హఠాత్తుగా రాజీనామాతో ఆశ్చర్యపరచగా.. తదుపరి బౌలింగ్ కోచ్ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశముంది. అయితే.. చంద్రకాంత్ మాదిరిగానే భరత్ అరుణ్(Bharat Arun)ను కూడా కోల్‌కతా వదిలించుకోవాలని భావిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గత మూడేళ్లుగా కోల్‌కతా బౌలింగ్ దళాన్ని పర్యవేక్షిస్తూ.. మెలకువలు నేర్పుతున్న భరత్‌ను పట్టేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పావులు కదుపుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే సీఎస్కే కోచింగ్ టీమ్‌లో ఈ మాజీ టీమిండియా పేసర్ చేరడం లాంఛనమే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎరిక్ సిమన్స్ చెన్నై బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.
KKR have mutually parted ways with Chandrakant Pandit and Bharat Arun.#IPL #KKR #ChandrakantPandit #BharatArun #CricketTwitter pic.twitter.com/Wse3QjSQmB
— InsideSport (@InsideSportIND) July 29, 2025
ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, భరత్ అరుణ్‌లు ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరితో సీఎస్కే ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకొనే అవకాశాలున్నాయి. అయితే.. ఈ విషయంపై చెన్నై యాజమాన్యం, సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించాల్సి ఉంది.
కోచ్‌గా సుదీర్ఘ అనుభవం, మంచి రికార్డు కలిగిన భరత్.. రెండు దఫాలు భారత జట్టుకు సేవలందించారు. 2014 -15 వరకూ బౌలింగ్ దళాన్ని నడిపించిన ఆయన.. రెండో పర్యాయం 2017 జూలై 16 నుంచి 2021 పొట్టి ప్రపంచ కప్ వరకూ కోచ్‌గా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే స్పీడ్స్టర్లు జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్‌లు రాటుదేలారు.