Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 2,68,785 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల జలాశయం పంప్‌హౌస్‌ల నుంచి 27,395 క్యూసెక్కులు, జూరాల స్పిల్‌వే నుంచి 1,19,064 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. అలాగే సుంకేవుల జలాశయం నుంచి 1,22,326 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల నుంచి మొత్తంగా 2,89,670 క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్నారు. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ వైపుగా 65,712 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని తెలిపారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,397 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని పేర్కొన్నారు. అలాగే స్పిల్‌వే గేట్ల ద్వారా 1,90,099 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Srisailam Project
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.90 అడుగుల మేర నీరున్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 269.750 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 269.125 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.
Srisailam Project2