నల్లగొండ రూరల్, జూలై 29 : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ ముసిబుద్దిన్, పంచాయతీ కార్యదర్శి ఆశ ఉన్నారు.