IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఓటమి తప్పలేదు. టాపార్డర్‌నే నమ్ముకంటూ వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు.. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్ల ధాటికి కుప్పకూలింది. భారీ ఛేదనలో టాపార్డర్‌లోనే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్.. రవీంద్ర జడేజా (2-17), నూర్ అహ్మద్(3-21)ల స్పిన్‌కు విలవిలలాడింది. ఈ ఇద్దరూ తిప్పేయడంతో 83 పరుగుల తేడాతో సీఎస్కే జయకేతనం ఎగురవేసింది. ఈ ఎడిషన్‌కు విజయంతో వీడ్కోలు పలికింది. గత మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని అందుకోలేక లక్నో చేతిలో చిత్తైన గిల్ బృందానికి తాజా పరాజయం శరాఘాతమే.
ప్లే ఆఫ్స్ చేరుకోలేదనే బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మురిసింది. లీగ్ దశ చివరి పోరులో గుజరాత్ టైటాన్స్‌ను వాళ్ల సొంత గడ్డపైనే ఓడించిన సీఎస్కే గెలుపు సంబురాలు చేసుకుంది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 330 రన్స్ కొట్టిన చెన్నై.. అనంతరం బౌలర్ల విజృంభణతో ఆతిథ్య జట్టును 147కే కట్టడి చేసింది. 83 పరుగుల భారీ విజయంతో టోర్నీకి వీడ్కోలు పలికింది ధోనీ సేన. మరోవైపు.. గత పోరు లక్నో చేతిలో కంగుతిన్న గిల్ బృందానికి.. ఈ ఓటమి రెండో హార్ట్‌బ్రేక్ కానుంది.
Bowing out with a W!
Until next time, Superfans! 💛🥳#GTvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/iEDYjAF0ww— Chennai Super Kings (@ChennaiIPL) May 25, 2025
వరుసగా రెండో మ్యాచ్‌లో 200 ప్లస్ ఛేదనకు సిద్దమైన గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై పేసర్లు భారీ షాక్ ఇచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(13)ను అన్షుల్ కంబోజ్ మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. 24కే తొలి వికెట్ పడిన వేళ జోస్ బట్లర్(5), సాయి సుదర్శన్(41 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకుంటాడని అనుకుంటే.. అతడిని ఖలీల్ వెనక్కి పంపాడు. వరుసగా రెండు వికెట్ల షాక్ నుంచి తేరుకునేలోపే.. డేంజరస్ హిట్టర్ రూథర్‌ఫొర్డ్(0)ను అన్షుల్ డకౌట్ చేశాడు. అంతే.. గుజరాత్ 5వ ఓవర్ మూడో బంతికే మూడో కోల్పోయింది.
తద్వారా ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్ సేన తొలిసారి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ సాయి సుదర్శన్(41), షారుక్ ఖాన్(19)లు ఆదుకునే ప్రయత్నం చేశారు. శివం దూబే వేసిన 10వ ఓవర్లో సాయి వరుసగా రెండో ఫోర్లు కొట్టగా.. షారుక్ ఖాన్ స్ట్రెయిట్‌గా సిక్సర్ బాదగా స్కోర్ 80 దాటింది. 10 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 85-3. దాంతో, అప్పటికీ ఆ జట్టుకు గెలుపుపై ఆశలు ఉన్నాయి.
క్రీజులో పాతుకు పోయిన సాయి, షారుక్‌లను విడదీసిన జడేజా గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత బంతి అందుకున్న జడ్డూ.. తొలుత షార్క్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో, నాలుగు వికెట్ 55 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి సాయి పెద్ద షాట్ ఆడి శివం దూబేకు చిక్కాడు.
Jadeja’s magic on your feed! ✨#GTvCSK #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 25, 2025
అంతే.. 86 వద్ద గుజరాత్ ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత నూర్ అహ్మద్ (3-21) తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ రషీద్ ఖాన్(12), గెరాల్డ్ కొయెట్జీ(5), రాహుల్ తెవాటియా(14)లను ఔట్ చేసి గుజరాత్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. అన్షుల్ కంబోజ్ వేసిన 19వ ఓవర్లో సాయి కిశోర్ ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో గుజరాత్ 147కే ఆలౌటయ్యింది.
చివరిదైన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. ఆకలిగొన్న సింహల్లా గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలతో విజృంభించారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే(52), ఆయుష్ మాత్రే (34) రెచ్చిపోయి ఆడారు. వరుసగా 6, 6, 4, 4, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. మాత్రేతో కలిసి 44 రన్స్ జోడించిన కాన్వే.. అనంతరం.. ఉర్విల్ పటేల్(37)తో కలసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దూకుడుగా ఆడిన ఉర్విల్ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ఉర్విల్.. ఆ తర్వాత క్రీజు వదిలి పెద్ద షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో శుభ్‌మన్ గిల్ చేతికి దొరికాడు. దాంతో, 107 వద్ద చెన్నై రెండో వికెట్ పడింది.
బ్రెవిస్(57), కాన్వే(52)
ఆఖర్లో కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్(57) ఆకాశమే హద్దుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్.. చెన్నై స్కోర్ 200 దాటించాడు. డెత్ ఓవర్లలో జడేజాతో కలిసి శివాలెత్తిపోయాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 6, 4 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాన్వే, బ్రెవిస్ మెరుపులతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.