సిర్పూర్(యూ) : ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ( యూ ) మండలం ధనోరా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందింది . జైనూర్ సీఐ రమేష్ , సిరిపూర్ ఎస్సై గంగారం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ మండలం గుంనూరు గ్రామానికి చెందిన కనక జానుబాయి (58) అనే మహిళ అనారోగ్యం కారణంతో గురువారం ఇంటి నుంచి ఎవరికి తెలియకుండా బయటకు వెళ్లిపోయిందన్నారు.
కుటుంబ సభ్యులు మూడు రోజులుగా వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం ధనూర గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యవసాయ బావిలో మహిళ పడి మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించామని తెలిపారు. మృతురాలి భర్త జంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.