Cristiano Ronaldo :ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ(Al Nassri) తరఫున ఇరగదీస్తున్నాడు. కీలక మ్యాచుల్లో గోల్స్‌తో జట్టను విజయాల బాట పట్టిస్తున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ తజాగా సూపర్ గోల్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. సౌదీ ప్రో లీగ్(Soudi Pro League)లో భాగంగా రియాద్‌లోని కింగ్ సాద్ యూనివర్సిటీ స్టేడియంలో శుక్రవారం అల్ అఖ్డౌడ్ జట్టుపై రొనాల్డో మెరుపు గోల్ కొట్టాడు. తొలి అర్ధ భాగంలో పలుమార్లు గోల్ కోసం ప్రయత్నించిన రొనాల్డో.. 80వ నిమిషంలో అద్భుతం చేశాడు.
అఖ్డౌడ్ డిఫెండర్లను దాటుకొని 30 అడుగుల దూరం నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. అంతే.. ఆ క్షణం స్టేడియమంతా ఊగిపోయింది. కామెంటేటర్లతో పాటు అభిమానులంతా రొనాల్డో నినాదాలతో స్డేడియాన్ని హోరెత్తించారు. దాంతో, ఈ ఏడాది రొనాల్డో గోల్స్ సంఖ్య 48కి చేరింది. ఈ మ్యాచులో అల్ నస్రీ 3-0తో గెలుపొంది.. టేబుల్ టాపర్ అల్ హిలాల్‌కు మరింత చేరువైంది.
اعاد الهدف التاريخي
ر pic.twitter.com/25wEf8f259— ميديا عالم النصر (@nfcm23) November 24, 2023
ఈ ఏడాది ఆల్నస్రీ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 18 గోల్స్ కొట్టడమే కాకుండా 9 గోల్స్‌కు సహాయం చేశాడు. నిరుడు ఖతార్‌లో వరల్డ్ కప్ సమయంలో గొడవ కారణంగా రొనాల్డో మాంచెస్టర్ యూనైటెడ్‌ను వీడాడు. అతడిని దక్కించుకునేందులు పీఎస్జీతో సహా పలు క్లబ్స్ పోటీపడ్డాయి. చివరకు అల్ నస్రీ క్లబ్ రూ.4,400 కోట్ల భారీ ధరకు రొనాల్డో కాంట్రాక్ట్ చేసుకుంది.