Harom Hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రకతటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ టీజర్‌కు సంబంధించి చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంఛ్ చేయబోతున్నట్లుగా తెలిపింది. ఇక ఈ మూవీలో రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.
Get Ready to witness
“The POWER of SUBRAMANYAM”, to be released by the Pan-India star to the World❤️🔥Rebel Star #Prabhas will unveil the Telugu Teaser of #HaromHara on 27th NOV @ 2:30 PM💥
Book your Passes: https://t.co/Zmc7jzG5TT@isudheerbabu @ImMalvikaSharma… pic.twitter.com/0nbVR5o44D
— Vamsi Kaka (@vamsikaka) November 26, 2023
ఇక ఈ ఏడాది మొదట్లో ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు సుధీర్‌బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలింది. అయితే ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమా కోసం మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ కష్టపడినా.. సినిమా బోరింగ్‌గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ ‘హరోంహర’ చిత్రంపైనే.