Santhana Prapthirasthu | విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14న రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. రీసెంట్గా డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో,జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు సినిమాల్లో నవంబర్ 1 ర్యాంకింగ్లో నిలిచినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు అమెజాన్ ప్రైం వీడియో ఇండియాలో టాప్ 10లో నిలిచింది. కథ, సంగీతం, నటీనటుల పర్ఫార్మెన్స్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సూపర్ బజ్ నడుస్తోంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్, మురళీ ధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.
చైతన్య (విక్రాంత్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడు ఓ ఎగ్జామ్ సెంటర్ లో కల్యాణి (చాందిని చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. వీరి ప్రేమను కళ్యాణి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. త్వరగా ఓ బిడ్డను కనేస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించి చైతన్య ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. అయితే పరీక్షలు చేయించుకోగా చైతన్యకు ఓ సమస్య ఉందని తేలుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇంతకీ ఇద్దరికీ పిల్లలు పుట్టారా.. లేదా అనే నేపథ్యంలో సాగే కథ అందరినీ ఇంప్రెస్ చేస్తూ సాగుతుంది. ఇంకేంటి సినిమాపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Adhi dha reality! 🤧
Santhana Prapthirasthu now streaming on JioHotstar! 💫#SanthanaPrapthirasthuOnJioHotstar #SanthanaPrapthirasthu @ThisIsVikranth @iChandiniC @sanjeevflicks @vennelakishore @AbhinavGomatam @madhurasreedhar #NirviHariPrasadReddy@MadhuraEt @NirviArts… pic.twitter.com/kiTIZhRbzp
— JioHotstar Telugu (@JioHotstarTel_) December 24, 2025