Nitish Rana : భారత క్రికెటర్, ఐపీఎల్ ఛాంపియన్ నితీశ్ రానా (Nitish Rana) తండ్రి అయ్యాడు. 18వ సీజన్ సమయంలో గర్భవతిగా ఉన్నఅతడి భార్య సాచి మర్వా (Saachi Marwah) ఇద్దరు పండంటి మగబిడ్డలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాచీ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దాంతో, రానా దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఫ్రాంచైజీలు కొత్తగా తల్లిదండ్రులైన ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపాయి. పలువురు క్రికెటర్లు నితీశ్‌కు ఫాదర్స్ క్లబ్‌లోకి స్వాగతం చెప్పారు.
ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన నితీశ్ రానా అద్భుతంగా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై మెరుపు అర్ధ శతకం బాదిన తర్వాత అతడు గ్యాలరీలో ఉన్న తన భార్య వైపు చూస్తూ.. ‘ఊయల సంబురాలు'(Cradle Celebration) చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్‌తో తాను త్వరలోనే తండ్రి కాబోతున్నానని అందరికీ తెలియజేశాడీ హిట్టర్. అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న రానా భార్య సాచీ జూన్ 14న కవలలకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా పంచుకుంది.
బేబీ రానా అనే పేరు, భర్త చేయిపై ఉన్న లవ్ టాటూ కనపడేలా ఉన్న ఫొటోకు..’ కలకాలం నిలిచిపోయే టాటూల నుంచి .. ట్విన్ బాయ్స్ వరకూ. మేము అలానే ఉన్నాం. ఇప్పుడు మా ప్రపంచంలోకి ఇద్దరు చిన్నారులు వచ్చి చేరారు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది న్యూ మామ్ సాచీ.
దేశవాళీలో నిలకడగా రాణించిన నితీశ్ రానా ఐపీఎల్‌తో మరింత రాటుదేలాడు. 2015లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన రానా 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ వేసుకున్నాడు. మిడిలార్డర్లో విలువైన ఆటగాడిగా ఎదిగిన అతడు.. 16వ సీజన్లో కోల్‌కతాకు సారథిగానూ వ్యవహరించాడు.
నిరుడు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన రానా.. 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక టీమిండియా ప్లేయర్‌గా మాత్రం అతడి కెరియర్ గొప్పగా సాగలేదనే చెప్పాలి. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ శ్రీలంకపై తొలి వన్డే, టీ20లు ఆడాడు.