Union Minister Piyush Goyal | కేంద్ర మంత్రి ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం
Union Minister Piyush Goyal | ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూస్ గోయల్ ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది.
అమరావతి : ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూస్ గోయల్ ( Union Minister Piyush Goyal ) ప్రయాణించే హెలికాప్టర్లో ( Helicopter ) సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తన పర్యటనను అర్దంతరంగా రద్దు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అమరావతి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి వెళ్లిన కేంద్ర మంత్రి అక్కడ పర్యటనను పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కారు.
అదే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ సిబ్బంది కేంద్ర మంత్రి గోయల్ భద్రత సిబ్బందికి వివరించారు. దీంతో ముందు జాగ్రత్తగా తన కృష్ణ పట్నం పర్యటనను రద్దు చేసుకుని తిరుపతి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ వాడుతున్నారు. ఇదే హెలికాప్టర్‌ను కేంద్ర మంత్రికి వినియోగించారు.
ఈ హెలికాప్టర్లో తరుచూ సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ఏపీ డీజీపీ హరీష్‌కుమర్ గుప్తా విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఈ హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా స్పష్టంగా నివేదిక ద్వారా తెలియజేయాలంటూ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు డీజీపీ లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

