KC Cariappa : భారత క్రికెటర్ కేసీ కరియప్ప(KC Cariappa) పోలీసులను ఆశ్రయించాడు. మాజీ ప్రియురాలు తన కెరీర్‌ను నాశనం చేస్తానంటోందని శుక్రవారం కరియప్ప బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నా మాజీ గర్ల్‌ఫ్రెండ్ దివ్య(Divya) నన్ను కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తోంది. సూసైడ్ నోట్లో నా పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది’
అని కరియప్ప తెలిపాడు.
అంతేకాదు.. ‘ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది. పైగా తను డ్రగ్స్, మందు(ఆల్కహాల్) పెద్ద మొత్తంలో తీసుకుంటుంది. అంతేకాదు ఆమెకు ఎందరితోనే లైంగిక సంబంధాలు ఉన్నాయి’ అని 29 ఏండ్ల కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే.. నిరుడు డిసెంబర్ 31వ తేదీన కరియప్పపై దివ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ‘సెప్టెంబర్‌లో కరియప్ప నన్ను గర్భవతిని చేశాడు. అనంతరం బలవంతంగా తనతో అబార్షన్ ట్యాబ్లెట్లు వేసుకొనేలా చేశాడు’ అని దివ్య తన ఫిర్యాదులో తెలిపింది.
కరియప్ప
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బెంగళూరుత తరఫున రాణించిన కరియప్ప ఐపీఎల్(IPL)లోనూ మెరిశాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 2021 సీజన్లో లెగ్ బ్రేక్ బౌలర్ అయిన కరియప్పను రూ.20 లక్షలకు కొన్నది. ఆ తర్వాతి సీజన్లలో కరియప్ప పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.