Salaar Movie | ‘సలార్’ సినిమాకు పిల్లలను అనుమతించలేదని గొడవ పెట్టుకున్న తల్లి.. వీడియో వైరల్
Salaar Movie | ప్రభాస్ (Prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Salaar Movie | ప్రభాస్ (Prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు వెళ్లిన ఓ యువతీ తన పిల్లలను సినిమాకు అనుమతించలేదని గొడవ పెట్టుకుంది.
సలార్ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే ఈ సినిమా చూడటానికి ఓ యువతీ ఉప్పల్ DSL మాల్ లోని సినీ పోలీస్ (Cine polis) థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకుంది. అయితే సినిమా టైంకి ఆమె తన పిల్లలను వెంటబెట్టుకుని థియేటర్‌కు వెళ్లగా.. సినీ పోలీస్ నిర్వహకులు ఆమెను అడ్డుకుని పిల్లలకు ఈ సినిమా అనుమతి లేదని ఇది ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా అని చెబుతారు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె తన పిల్లలను సినిమాకు అనుమతించలేదంటూ థియేటర్ సిబ్బందితో గొడవ పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సలార్ సినిమాకి పిల్లలని అనుమతించలేదని గొడవపెట్టుకున్న తల్లి
హైదరాబాద్ – ఉప్పల్ DSL మాల్ లోని సినీ పోలీస్ థియేటర్లో నడుస్తున్న సలార్ సినిమాకి A సర్టిఫికేట్ ఉండగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోగా తన పిల్లలని అనుమతించలేదని ఓ తల్లి గొడవ పెట్టుకుంది. pic.twitter.com/xqDIm8YEaT
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2023
బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.178 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.295 కోట్లు వసూలు చేసింది. అయితే మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ రూ.402 కోట్ల వసూళ్లు రాబట్టింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

