మెల్బోర్న్: అగ్రశ్రేణి జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య 2027 మార్చిలో జరుగబోయే 150వ వార్షికోత్సవ టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరింత సొబగులు అద్దుతోంది. ఇరుజట్లకు ప్రత్యేకమైన ఈ టెస్టును మరింత ప్రత్యేకంగా మార్చేందుకు గాను ఈ మ్యాచ్ను ఫ్లడ్లైట్ల వెలుతురులో (పింక్ బాల్ టెస్టు) ఆడించనున్నారు.
ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో కూడా పురుషుల క్రికెట్లో ఇదే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడం విశేషం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు 1877లో తొలి టెస్టు ఆడగా 1977లో వందేండ్ల సంబురాన్ని ఘనంగా నిర్వహించుకుంది.