మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జాబితాను గురువారం సీఏ విడుదల చేసింది. పేస్, స్పిన్, హిట్టర్స్‌తో కూడిన ఈ జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌ల నుంచి తప్పుకున్న స్మిత్, వార్నర్, కమిన్స్ తిరిగి జట్టులోకి చేరారు. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు బ్యాకప్‌గా యువ సంచలనం ఇంగ్లిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఐదు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆసీస్‌కు పొట్టి ప్రపంచకప్ మాత్రం అందని ద్రాక్షగానే మారింది.