Craig Williams : పురుషుల వన్డే ప్రపంచ కప్ పోటీలకు ఇంకో ఏడాది ఉంది. కానీ, పలు దేశాలు ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. పసికూన నమీబియా సైతం మెగా టోర్నీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టుకు కొత్త కోచ్‌గా క్రెగ్ విలియమ్స్(Craig Williams) నియమితులయ్యాడు. 2026 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతడిని ఎంపిక చేసింది బోర్డు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మంగళవారం నమీబియా బోర్డు ప్రకటించింది. ప్రస్తుత కోచ్ పియెర్రి బ్రుయన్ స్థానంలో విలియమ్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
విలియమ్స్ 2007లో నమీబియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన అతడు 2022లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. వరల్డ్ కప్ కోసం నమీబియా బోర్డు విలియమ్స్‌ను సంప్రదించింది. దాంతో, కోచ్‌గా ఉండేందుకు ఈ మాజీ క్రికెటర్ ఓకే చెప్పాడు. 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్‌లో నమీబియా ఆటగాళ్లకు విలియమ్స్ మార్గనిర్దేశనం చేయనున్నాడు.
BREAKING NEWS‼️
Namibian cricket legend Craig Williams is back — this time as the Head Coach of the FNB Eagles 🇳🇦🏏
Here’s to new heights and bold beginnings!
Click on the link below to read more.#EaglesPride #CricketNamibia #FNBNamibiahttps://t.co/8nz1B7JtVv
— Official Cricket Namibia (@CricketNamibia1) May 6, 2025
ఆల్‌రౌండర్ అయిన విలియమ్స్ నమీబియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 18 వన్డేల్లో 30.50 సగటుతో 488 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, ఫిఫ్టీ ఉన్నాయి. ఇక టీ20ల్లో 35 మ్యాచ్‌లు ఆడిన అతడు 805 రన్స్ కొట్టాడు. అత్యధిక స్కోర్.. 81.