Faria abdullah | జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. ఆరుడగుల బుల్లెట్టు మాదిరిగా ఉండే ఈ అమ్మడు సొగసు, మేని విరుపులతో కుర్రాళ్ళకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. నటించిన తొలి చిత్రంలోనే తనదైన అందం ప్రతిభతో మెప్పించిన ఫరియా అబ్ధుల్లా.. ‘జాతి రత్నాలు’లో చిట్టి పాత్రతో హృదయాలను గెలుచుకుంది. ఇటీవల సినిమాలతో పెద్దగా అలరించని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంటుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.
జాతిరత్నాలు హిట్‌తో ఆమె తెలుగునాట స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. హైట్ ఎక్కువగా ఉండడంతో స్టార్ హీరోల సినిమాల అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కాని అనుకున్న రేంజ్లో మాత్రం ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లో గెస్ట్ రోల్, బంగార్రాజులో ఐటెం సాంగ్స్ చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ఆ తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్లో హీరోయిన్గా నటించగా.. రావణాసురలో ఓ సైడ్ క్యారెక్టర్ చేసింది. అనంతరం ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తువదలరా 2 చిత్రాలలో నటించి మెప్పించింది.
కోలీవుడ్‌లో తొలిసారిగా వల్లి మయిల్ అనే సినిమాలో చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై ఫరియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక ఇళయ దళపతి విజయ్ వారసుడు జసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చిత్రంలో హీరోయిన్గా ఫరియా ఎంపికైనట్లుగా కోలీవుడ్ టాక్. టాలీవుడ్లో అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.తాజాగా యాంకర్ సుమ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఈ ముగ్గురు సూపర్స్టార్ల గురించి ఫరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు సెలబ్రెటీలతో డేటింగ్, లవ్, మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరి పేర్లు చెబుతారని సుమ అడుగుతుంది. దీనికి ఫరియా స్పందిస్తూ.. తనకు అవకాశం వస్తే యంగ్ పవన్ కళ్యాణ్‌తో డేటింగ్, నాగార్జునతో లవ్ , ప్రభాస్‌ని పెళ్లాడాలని ఉందని చెప్పిషాక్ ఇచ్చింది.