Vinesh Phogat | పారిస్ ఒలింపిక్ గేమ్స్ (Paris Olympic Games)లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో తనపై అనర్హతను వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (Court of Arbitration for Sports)లో సవాల్ చేసింది. వినేశ్ అభ్యర్థనను కాస్ తాజాగా విచారణకు స్వీకరించింది. ఒలింపిక్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు కాస్ (CAS) అధికారిక ప్రకటన చేసింది.
కాగా, అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది. అయితే, ఒలింపిక్స్‌లో నిబంధనలను మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆర్బిట్రేషన్ అనుమతి ఇస్తే వినేశ్‌కు సిల్వర్ మెడల్దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కాస్ ఏ తీర్పు ఇస్తుందా అని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనర్హత నేపథ్యంలో రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Court of Arbitration for Sports says, the decision on Vinesh Phogat’s plea against her disqualification is expected to be issued before the end of the Olympic Games pic.twitter.com/DuBIIB9Kax
— ANI (@ANI) August 9, 2024
Also Read..
Atishi | మనీశ్ సిసోడియాకు బెయిల్.. నిజం గెలిచిందంటూ భావోద్వేగానికి గురైన మంత్రి అతిషీ