Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. భారత్‌కు స్వర్ణం అందిస్తాడనే అంచనాలను అధిగమించలేకపోయినా రజతం దక్కించుకున్నాడు. రజత పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నీరజ్ చోప్రాతో మాట్లాడిన ప్రధాని అతడి గాయం గురించి ఆరా తీసి సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.
#WATCH | PM Narendra Modi spoke to Javelin thrower Neeraj Chopra and congratulated him on the Silver medal. He also enquired about his injury and lauded the sportsman spirit shown by his mother.#Paris2024 #Paris2024Olympic pic.twitter.com/DvVEMcNbPQ
— ANI (@ANI) August 9, 2024
నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై చోప్రా తల్లి స్పందించిన తీరునూ ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఆమె క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. కాగా, నాలుగేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగి బరిసెతో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా పారిస్‌లోనూ రజతంతో మెరిశాడు.
స్టేట్ డి ఫ్రాన్స్ వేదికగా గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్.. తుదిపోరులో అంచనాలను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఒలింపిక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 92.97 మీటర్ల రికార్డు త్రో తో పసిడి సొంతం చేసుకున్నాడు.
Read More :