హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు.. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు గుభాలిస్తున్నాయని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను కేసీఆర్ నిజం చేశారని తెలిపారు.
మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చారని చెప్పారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. జల్.. జంగల్.. జమీన్ అన్న కొమురం భీమ్ నినాదాన్ని కేసీఆర్ నిజం చేశారన్నారు.
విధ్వంసపు దారుల నుంచి
వికసిత తోవలు..మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు..గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది కేసీఆర్ గారు.… pic.twitter.com/SBI41EzG2G
— Harish Rao Thanneeru (@BRSHarish) August 9, 2024