Prithvi Shaw | యూట్యూబర్ సప్నాగిల్ (Sapna Gill)తో వివాదం కేసులో టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw)కు షాక్ తగిలింది. ఆయనకు కోర్టు ఫైన్ వేసింది. సప్నాగిల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 13న క్రికెటర్ తరఫున న్యాయవాదికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ.. ఆయన ఇంకా స్పందన దాఖలు చేయలేదని పేర్కొంది. ఈ మేరకు రూ.100 ఫైన్ కట్టాలని ముంబై దిండోషి సెషన్స్ కోర్టు (Dindoshi sessions court) ఆదేశించింది. అంతేకాదు, పృథ్వీ షాకు మరో అవకాశం కల్పిస్తూ.. తదుపరి విచారణ డిసెంబరు 16కి వాయిదా వేసింది.
2023లో ఆంధేరి బార్లో పృథ్వీ షా, అతడి స్నేహితుడు అశిష్ యాదవ్‌లు తమతో గొడవ పడ్డారని.. ఇద్దరూ తమపై బేస్‌బాల్ బ్యాటుతో దాడి చేశారని సప్న గిల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. కానీ, పోలీసులు పట్టించుకోలేదు. అయితే.. సప్న అనవసర రాద్ధాంతం చేస్తుందని, తనను కావాలనే ఇరికిస్తోందని షా సైతం ఆమెపై కంప్లైంట్ చేశాడు. దాంతో, సప్న ముంబై కోర్టును ఆశ్రయించింది.
Also Read..
Viral Video | నిమ్మకాయను తొక్కించబోయి.. కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన యువతి
PM Modi | భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్.. ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ రియాక్షన్
Kerala High Court | విటులపై కేసు నమోదు చేయొచ్చు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు