దుబాయ్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) టైటిల్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే కప్ ప్రజెంటేషన్ సమయంలో.. వేదికపై ఒక్క పాకిస్థానీ ప్రతినిధి కూడా లేరు. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీని ఈసారి ఆర్గనైజ్ చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డే. కానీ ఆదివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రతినిధి లేకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
న్యూజిలాండ్‌పై ఉత్కంఠభరిత ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. ఐసీసీ చైర్మెన్ జే షా చేతులు మీదుగా కప్‌ను రోహిత్ సన అందుకున్నది. అయితే ప్రజెంటేషన్ వేదికపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సాకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ టౌస్ కూడా పాల్గొన్నారు. కానీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ ప్రతినిధులు ఎవరూ ప్రజెంటేషన్ సమయంలో లేకపోవడం విస్మయానికి గురి చేసింది. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్.. దుబాయ్‌లోనే ఉన్నా.. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోషిన్ నఖ్వీ.. దుబాయ్‌కు వెళ్లలేదు. కేంద్ర మంత్రితో అత్యవసర భేటీ వల్ల ఆయన దుబాయ్‌కు వెళ్లలేదని తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నట్లు ఐసీసీకి ఆయన సమాచారం ముందుగానే అందజేశారు. ప్రజెంటేషన్ సమయలో ఒక్క పాకిస్థాన్ అధికారి లేకపోవడం పట్ల మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ సెర్మనీకి కనీసం ఒక్క పీసీబీ ప్రతినిధి వెళ్లకపోవడం వెనుక ఉన్న కారణం అర్థం కావడం లేదని షోయెబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలిచింది వాస్తవమే అని, కానీ పాకిస్థాన్ ఆ టోర్నీని నిర్వహించిందని, కానీ ట్రోఫీ ప్రజెంటేషన్‌కు ఒక్క పీసీబీ ప్రతినిది వెళ్లకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నాడు. తన ఎక్స్ అకౌంట్లో ఈ అంశంపై ఓ వీడియోను పోస్టు చేశాడు.
పోడియంపైకి ఎవరు రావాలన్న దానిపై ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుందని, కానీ పీసీబీ ప్రతినిధి సుమేర్ అక్కడే ఉన్నా..ఆయన తన పోడియం మీదకు పిలువలేదని ఆరోపణలు ఉన్నాయి.
This is literally beyond my understanding.
How can this be done???#championstrophy2025 pic.twitter.com/CPIUgevFj9— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025