Kranti Gaud : భారత మహిళల క్రికెట్ జట్టు పేస్ దళంలో కీలకమైన క్రాంతి గౌడ్ (Kranti Gaud) చరిత్ర సృష్టించింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్టులో నిప్పులు చెరిగిన క్రాంతి ఐదు వికెట్లతో అక్కడి హానర్స్ బోర్డు (Lords Honours Board)లో చోటు సంపాదించింది. తద్వారా లార్డ్స్ హానర్స్ బోర్డులో పేరు రాసుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కిందీ 22 ఏళ్ల స్పీడ్‌స్టర్. పోలీస్ కానిస్టేబుల్ కూతురైన క్రాంతి.. నిలకడైన బౌలింగ్ ప్రదర్శనతో దిగ్గజాలకు సాధ్యమవ్వని ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.
టీమిండియా విజయాల్లో కీలకమవుతున్న క్రాంతి గౌడ్ శ్రమకు తగిన గుర్తింపు లభించింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టులో చెలరేగిన ఈ స్పీడ్‌స్టర్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు (5-37) పడగొట్టింది. తన స్వింగ్ పవర్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించిన క్రాంతి.. తొలిసారి టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా.. లార్డ్స్ హానర్స్ బోర్డులో చేరింది.
Made a promise. Kept her word 🤞
And made her brother & family incredibly proud 🥹🎥 Kranti Gaud reflects on a historic day as she becomes the first woman to etch her name on the Lord’s Honours Board ✒️ – By @jigsactin #TeamIndia | #ENGvIND pic.twitter.com/DsUaPtQuAV
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
ఇప్పటివరకూ పురుష క్రికెటర్ల పేర్లకే పరిమితమైన ఆ బోర్డులో మొట్టమొదటి మహిళగా క్రాంతి తన పేరు రాసింది. చార్లొట్లే ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్), రాచెల్ హేహో ఫ్లింట్(ఇంగ్లండ్), మేగ్ లానింగ్(ఆస్ట్రేలియా).. ఝులాన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని రికార్డును తను సొంతం చేసుకుంది. మహిళా క్రికెటర్లలో మరెవరికీ అందని గౌరవాన్ని పొందిన క్రాంతి.. హానర్స్ బోర్డుపై పేరు రాస్తుంటే భారత క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.
Creating lasting memories as the 1️⃣st woman to have her name etched on the Test honours board at Lord’s 🥹
🎥 𝙍𝙖𝙬, 𝙚𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙖𝙡, 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ft. Kranti Gaud 🤍#TeamIndia | #ENGvIND pic.twitter.com/SUWTqEmL6p
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
నిరుడు భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా అవతరించడంలో క్రాంత్ గౌడ్ పాత్ర ఎనలేనేది. సీనియర్ పేసర్ రేణుకా సింగ్‌తో కలిసి వికెట్ల వేటతో హడలెత్తించిన క్రాంతి స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. వరల్డ్‌కప్ విజేతగా రాష్ట్రంలో అడుగుపెట్టిన క్రాంతికి అపూర్వ స్వాగతం లభించింది. భోపాల్‌లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) యువ పేసర్‌ను సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ఆమె తల్లిదండ్రులు, కోచ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రాంతికి ఆయన గుడ్‌న్యూస్ చెప్పారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి.. సస్పెండ్ అయిన ఆమె తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో.. క్రాంతి కుటుంబం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసింది.
క్రాంతి తండ్రి మున్నా సింగ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. అయితే.. కొన్ని కారణాల వల్ల 2012లో ఆయన సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కుటుంబానికి ఆర్దిక కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు లేకపోవడంతో తాము కొన్నిరోజులు ఒకటే పూట తిన్నామని క్రాంతి తెలిపింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా నాన్న మళ్లీ పోలీస్ ఉద్యోగంలో చేరి.. గౌరవంగా రిటైరవ్వాలని కోరుకుంటున్నా’అని చెప్పింది. ఈ వీడియో సీఎం దృష్టికి రావడంతో వరల్డ్ కప్ విజేత క్రాంతికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఆదివారం నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఆమె తండ్రిని తిరిగి పోలీస్ జాబ్‌లోకి తీసుకుంటామని సీఎం ప్రకటించారు.