Bihar : పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం ‘హోం శాఖ’ (Home Ministry)ను సీఎం వదిలేశారు. రెండు దశాబ్దాలుగా చూసుకున్న హోంను భారతీయ జనతా పార్టీకి సీఎం నితీశ్ అప్పగించారు. ఆయన శుక్రవారం ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీకి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ పరిణామంతో బిహార్‌లో అత్యధిక సీట్లు గెలుపొందిన బీజేపీ డ్రైవింగ్ సీట్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభంజనం సృష్టించింది. రెండొందలకు పైగా సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి సభ్యులతో శాసనసభాపక్ష నేతగా ఎంపికైన నీతీశ్ నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమి ఎమ్మెల్యేలు నొచ్చుకోకుండా ఇద్దరు ఉపముఖ్యమంత్రును నియమించుకున్న ఆయన అనంతరం మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేశారు.
Portfolio allocations in Bihar:
Samrat Chaudhary – Home
Dilip Jaiswal – Industries
Shreyasi Singh – Information & Sports
Mangal Pandey – HealthFor 1st time, Home Department was taken away from Nitish Kumar. pic.twitter.com/SFzVb9Q5uc
— The Bihar Index (@IndexBihar) November 21, 2025
అయితే.. కీలకమైన హోం శాఖతో పాటు స్పీకర్ పదవి కోసం బీజేపీతో పాటు ఆయన పార్టీ జేడీయూకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. చివరకు.. బీజేపీ ఒత్తిడితో నితీశ్ 20 ఏళ్లుగా తనవద్దే ఉంటున్న హోం శాఖను త్యాగం చేశారు. మరో ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు భూమి, రెవెన్యూ శాఖను అప్పగించారు. వీటితో పాటు గనులు, భూగర్భ శాఖ బాధ్యతలు విజయ్ కుమార్ చూసుకోనున్నారు. మంగల్ పాండేకు ఆరోగ్యం, న్యాయ శాఖ.. పరిశ్రమల శాఖ మంత్రిగా దిలీప్ జైస్వాల్ నియమితులయ్యారు.
🪔🇮🇳 #NitishKumar, sworn in for 10th term as #Bihar CM, extends greetings to #PMModi 🤝✨ https://t.co/CeFCIVoBNZ pic.twitter.com/WSxXPBYBfV
— Economic Times (@EconomicTimes) November 20, 2025
రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు గెలుపొంది మహాగఠ్‌బంధన్ ఆశలపై నీళ్లు చల్లింది నితీశ్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా.. జేడీ(యూ) 85 సీట్లతో రెండో స్థానంలో ఉంది. మహాఘట్బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే.