కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎస్ కృష్ణారావును ఐటీడీఏ అధికారులు సస్పెన్షన్
( Suspension ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల సస్పెన్షన్ చేస్తునట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విద్యార్థులతో తీసుకోవాల్సిన ఫోటోలను సూచన ప్రకారం అప్లోడ్ చేయకపోవడం, ముందు అనుమతి తీసుకోకుండా సెలవులు తీసుకున్నారు. గతంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, హెచ్చరిక మెమో ఉన్నప్పటికీ హాజరు, విధుల నిర్వహణలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడం, అకాడమిక్ రిజిస్టర్లు, రికార్డులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల సస్పెండ్ చేశారు. ఉత్తర్వులు అమలు ఉన్నంత కాలం ఎటువంటి అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.