Collector BM Santosh | పెండింగ్ భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ బీఎం సంతోష్
Collector BM Santosh | పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
గద్వాల : పెండింగ్ లో ఉన్న భూభారతి (Bhubarati ) దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh ) అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో భూ-భారతి, మీ – సేవ దరఖాస్తులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎఫ్-లైన్ పిటిషన్లపై మండలాల వారీగా తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు. ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
వచ్చిన దరఖాస్తులు ఆరు నెలలు దాటిన వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్ల లాగిన్లలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో ప్రభుత్వ భూములు లేదా కాలువలకు సంబంధించిన అంశాలు ఉంటే సర్వేయర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీంచి నివేదిక సమర్పించాలన్నారు.
దరఖాస్తులను తిరస్కరించే ముందు స్పష్టమైన కారణాలను తెలియజేస్తూ రిజెక్ట్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయంలో ఆదాయం, కుటుంబ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో జారీ చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,పెండింగ్‌లో ఉన్న ఎఫ్-లైన్ పిటిషన్లను వెంటనే పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SSR) ను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వెల్లడించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలను సందర్శిస్తూ ఉండాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు అందిస్తున్నారా లేదా పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో అలివేలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రామ్ చందర్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

