Smriti Mandhana : భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి వేడుక మొదలైంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చ్ల్ (Palash Mucchhal)తో ఆరేళ్ల ప్రేమలో మునిగితేలిన మంధాన వివాహ క్రతువు సంబురంగా జరుగుతోంది. సంప్రదాయం ప్రకారం మొదటిదైన హల్దీ వేడుకలో ఈ డాషింగ్ బ్యాటర్ ఖుషీగా కనిపించింది. ఇటీవలే స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలుపొందిన భారత బృందంతో మంధాన డాన్స్ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం టీమిండియా స్టార్ల డాన్స్ వీడియో నెట్టింట వైరలవుతోంది.
వరల్డ్ కప్ ఛాంపియన్ స్మృతి మంధాన ఈ వారమే పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించనుంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Mucchhal)తో ప్రేమలో ఉన్న మంధాన నవంబర్ 23న అతడిని మనువాడనుంది. ఈ స్టార్ జంట పెళ్లి తేదీని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వెల్లడించారు. పెళ్లి సంబురాల్లో ఒకటైన హల్దీ వేడుక శుక్రవారం మొదలైంది. ఈ కార్యక్రమానికి పసుపు డ్రెస్ కోడ్‌తో హాజరైన వరల్డ్ కప్ విజేతలు డాన్స్‌తో హోరెత్తించారు. షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, రేణుకా సింగ్, రీచా ఘోష్ తదితరులు కాబోయే వధువుతో హుషారుగా స్టెప్పులు వేశారు.
Smriti mandhana Haldi ceremony pic.twitter.com/kcdm7dYlvi
— Sahil Singhadiya (@SahilSinghadiya) November 21, 2025
A glimpse of Smriti Mandhana’s haldi ceremony 🟡😍
📸: Shafali Verma/ Instagram #SmritiMandhana #CricketTwitter pic.twitter.com/8WdPrzXv01
— InsideSport (@InsideSportIND) November 21, 2025
కల్యాణ వేడుకకు సమయం సమీపిస్తున్నవేళ మంధాన తన నిశ్చితార్ధం ఉంగురాన్ని చూపిస్తూ మురిసిపోయింది. అంతేకాదు తన ప్రేయసి మంధానకు పలాశ్ ప్రపోజ్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. రల్డ్ కప్ ఫైనల్ జరిగిన డీవై పాటిల్ స్టేడియంలోనే పలాశ్ తన లవ్ లైఫ్ అయిన మంధానకు ప్రపోజ్ చేశాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి మైదానంలోకి తీసుకొచ్చిన ఈ సింగర్.. మోకాళ్లపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అందుకు మంధాన ఎస్ అనడంతో ఆమె వేలికి ఉంగురం తొడిగాడు. ఆ తర్వాత భారత స్టార్ సైతం అతడికి ఉంగురం తొడిగి.. హగ్ చేసుకుంది.
A lovely proposal by Palash Muchhal to Smriti Mandhana at DY Patil Stadium! 😍💍
📸: Palash Muchhal/ Instagram #SmritiMandhana #PalashMuchhal #CricketTwitter pic.twitter.com/lHDHfSqz2O
— InsideSport (@InsideSportIND) November 21, 2025
భారత ఓపెనర్‌గా అదరగొడుతున్న మంధానకు, కచేరీలు, సొంతంగా ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన పలాశ్ ముచ్చల్‌కు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి తరచూ పార్టీల్లో కలుస్తుండేవాళ్లు. అలా ఒకరిమీద ఒకరికి 2019 లోనే ప్రేమ పుట్టింది. అలాగని తమ రిలేషన్‌షిప్‌ను ఇద్దరూ రహస్యంగానే ఉంచారు. ఈ జంట 2013లో తొలిసారి దీపావళి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయినా సరే మంధాన, పలశ్లు ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఇద్దరూ జంటగా కెమెరా కంట పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేయసికి పలాశ్ పియానో గురువుగా మారాడు. ఆ వీడియో అప్పట్లో కూడా బాగా వైరల్ అయింది.