PV Sindhu | షెన్జెన్(చైనా): చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 16-21, 21-17, 21-23తో యోయో జియామిన్(సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది. గత కొన్ని నెలలుగా స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోతున్న సింధు ఆదిలోనే నిష్క్రమిస్తున్నది. మిగతా మ్యాచ్‌ల్లో అనుపమ ఉపాధ్యాయ 7-21, 14-21తో నత్సుకి నిదైరా(జపాన్), మాళవిక బన్సోద్ 9-21, 9-21తో సుపనిద కాటెథాంగ్(థాయ్‌లాండ్) చేతిలో ఓడారు.
డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్, త్రిసాజాలీ జోడీ 16-21, 11-21తో రెండో సీడ్ లియు షెంగ్, టాన్ నింగ్ ద్వయం చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-6, 21-16తో రాస్మస్ గెమ్కే(డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించి అండర్స్ ఆంటోన్సెన్తో పోరుకు సిద్ధమయ్యాడు. డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి ద్వయం 21-19, 21-15తో రాస్మస్ కయెర్-ఫ్రెడరిక్ సొగార్డ్ జోడీపై గెలిచి ముందంజ వేసింది.