Lionel Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) నేతృత్వంలోని అర్జెంటీనా(Arjentina)కు భారీ షాక్ తగిలింది. హాంకాంగ్(Hong kong)తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీ ఆడకపోవడంతో ఇప్పుడు ఆ జట్టు పెద్ద మూల్యమే చెల్లించనుంది. మెస్సీ గైర్హాజరీనిన్ని సీరియస్‌గా తీసుకున్న చైనా మార్చిలో జరగాల్సిన అర్జెంటీనా పర్యటనను రద్దు చేసింది. ఈ మేరకు ఆదివారం బీజింగ్‌లోని ఫుట్‌బాల్ అసోసియేషన్(Beijing Football Association) ఒక ప్రకటన విడుదల చేసింది.
మార్చి’ నెలలో ఐవరీ కోస్ట్‌తో జరగాల్సిన అర్జెంటీనా ఫ్రెండ్లీ మ్యాచ్‌లను మేము నిర్వహించడం లేదు. ఆ మ్యాచ్‌ల కోసం మేము ప్లాన్ చేయలేదు. మెస్సీ ఆడాల్సిన మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా లేము’ అని బీజింగ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. చైనా క్రీడా శాఖ అధికారులు అర్జెంటీనా, నైజీరియా ఫ్రెండ్లీ మ్యాచ్‌ను రద్దు చేసిన మరుసటి రోజే బీజింగ్ ఫుట్‌బాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. షెడ్యూల్ ప్రకారం మార్చి 18 నుంచి 26 మధ్య అర్జెంటీనా జట్టు చైనాలో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
లియోనల్ మెస్సీ
అయితే.. హాకాంగ్తో ఫిబ్రవరి 4న జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇంటర్ మియామి కెప్టెన్ మెస్సీ బరిలోకి దిగలేదు. దాంతో, అతడిని చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మెస్సీ ఆడకపోవడంతో మ్యాచ్ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో, మెస్సీ గజ్జల భాగంలో నొప్పి కారణంగానే ఇంటర్ మియామి మేనేజెమెంట్ వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందలేదు. బుధవారం మెస్సీ వెస్సెల్ కొబె క్లబ్‌తో ఆడినా కూడా బీజింగ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అర్జెంటీనా పర్యటనను రద్దు చేసేందుకు మొగ్గు చూపింది.