Health Tips | దవాఖానలో చేరారా.. అయితే ఇవి మీ దరిచేరినట్టే!
ట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉండటం వల్ల న్యుమోనియా వస్తుంది. దీంతో హాస్పిటల్లో చేరిన వారిలో.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికంతా న్యుమోనియా ముప్పు ఉన్నట్టే.
- దవాఖానలో దంతధావనం
Health Tips | నోట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉండటం వల్ల న్యుమోనియా వస్తుంది. దీంతో హాస్పిటల్లో చేరినవారిలో.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికంతా న్యుమోనియా ముప్పు ఉన్నట్టే. అయితే, దవాఖానలో ఉన్నన్ని రోజులూ క్రమం తప్పక బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోచ్చు. ‘జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాల్ని వెల్లడించింది. హాస్పిటల్ వాతావరణం వల్ల నోటిలో పేరుకునే బ్యాక్టీరియా రోజూ బ్రష్ చేసుకోవడం దూరం అవుతుంది. న్యుమోనియా ముప్పు కూడా తగ్గిపోతుంది. రోగి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే సమయాన్ని, మెకానికల్ వెంటిలేటర్ మీద గడపాల్సిన సమయాన్ని కూడా ఇది తగ్గిస్తుందని తెలిపింది.
మంచి మూడ్‌కు.. యోగర్ట్
యోగర్ట్ పొట్ట ఆరోగ్యాన్నే కాదు మన మూడ్‌ను కూడా మెరుగుపరుస్తుంది. యోగర్ట్‌లో ఉండే లాక్టోబాసిల్లస్ మన శరీరం ఒత్తిడిని ఎదుర్కొనేలా సాయపడుతుంది. కుంగుబాటు, ఆందోళనను కూడా నివారిస్తుంది. దీనికి సంబంధించిన అధ్యయనం ‘బ్రెయిన్, బిహేవియర్, అండ్ ఇమ్యూనిటీ’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ ఫలితాలు ఆందోళన, కుంగుబాటు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యల చికిత్సకు కొత్త దారులను తెరుస్తాయి అంటున్నారు పరిశోధకులు.
జన్యువులు- ఊబకాయం
పోషకాల్లేని ఆహారం, శారీరక శ్రమ లోపించడం వల్లే ఊబకాయం వస్తుందనుకుంటాం. అయితే.. మన వయసు, మనం వేసుకునే మందులు, మన నిద్ర అలవాట్లు కూడా ఈ విపరీతానికి దారితీస్తాయి. కొన్ని జన్యువుల ప్రభావాన్నీ కాదనలేం. స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో ఒక విషయం తేలింది. మూలకారణాన్ని బట్టి ఊబకాయం మన ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని తేలింది. పరిసరాలు, జీవనశైలి తదితర ప్రభావాల వల్ల బరువు పెరిగిన వారితో పోలిస్తే అధిక బాడీ మాస్ ఇండెక్స్, జన్యు పరమైన ఊబకాయులకు గుండెజబ్బు ముప్పు కొంచెం తక్కువగా ఉంటుందట. ఏది ఏమైనా.. శరీర బరువు, జన్యువులతో సంబంధం లేకుండా మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాల్సిందేనని అధ్యయనం నొక్కి చెప్పింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

