రాయ్పూర్: కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు.
ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించడానికి గాను నిర్వాహకులు అక్కడే టెంట్లను వేయించారు. అయితే టెంట్ మీద ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో అక్కడే ఉన్న సతీశ్, శ్యామ్లాల్, సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.