Chetan Sharma | టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదం తెలిపింది.
ప్రముఖ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ వివావాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కోహ్లీ – రోహిత్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. వారిలో ఇగో ఉందని పేర్కొన్నాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి బీసీసీఐపై పైచేయి సాధించాలని కోహ్లీ భావించాడని పేర్కొన్నారు. దీనివల్లే గంగూలీ, కోహ్లీ మధ్య గ్యాప్ పెరిగిందని అన్నారు. టీమిండియా ఆటగాళ్లు తమ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేందుకు ఇంజెక్షన్లు వాడుతారని.. డోపింగ్ టెస్ట్‌లో అవి దొరకవని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడంపై బీసీసీఐ పెద్దలు చేతన్ శర్మపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని భావించారు. ఇలాంటి తరుణంలో చేతన్ శర్మ రాజీనామా చేయడం గమనార్హం.