Chateshwar Pujara : ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన(Engalnd Tour)కు వెళ్లనుంది. అక్కడ టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే.. నిరుడు చెత్త ప్రదర్శనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయింది రోహిత్ సేన. దాంతో, ఇంగ్లండ్ సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్‌గా తీసుకోనుంది. దాంతో, స్క్వాడ్‌లో ఉండేది ఎవరు? అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) సెలెక్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, జట్టును గెలిపించే బాధ్యత తనదేనని చెప్పాడీ నయా వాల్.
ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో టీమిండియాకు వెన్నెముకగా నిలుస్తూ వచ్చాడు పుజారా, అయితే.. నిరుడు ఇంగ్లండ్ టూర్లో పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అంతే.. మళ్లీ జట్టులోకి రాలేదు. కానీ, దేశవాళీలో మాత్రం అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. మరోసారి తనకు అవకాశం ఇస్తే జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని అంటున్నాడీ బ్యాటర్. ‘భారత జట్టుకు నా అవసరం ఉంటే.. నాకు మళ్లీ అవకాశం వస్తుంది. అందుకు నేను మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నాను. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాను. దేశవాళీలో దంచేస్తున్నాను.
𝐑𝐞𝐚𝐝𝐲 𝐟𝐨𝐫 𝐚 𝐜𝐨𝐦𝐞𝐛𝐚𝐜𝐤! 🇮🇳🧢
Cheteshwar Pujara expresses his desire to return to the Indian Test squad for the England tour.
𝐓𝐡𝐞 𝐖𝐚𝐥𝐥 𝟐.𝟎 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐝𝐨𝐧𝐞 𝐲𝐞𝐭!
📷: ICC#TeamIndia #TestCricket #Cricket #CheteshwarPujara #ENGvIND pic.twitter.com/eJV2RTjFGe
— SportsTiger (@The_SportsTiger) May 2, 2025
సో.. ఇంగ్లండ్ పర్యటనలో నా అసవరం కచ్చితంగా రావచ్చు. ఎందుకంటే.. గత 20 ఏళ్లలో అక్కడ భారత జట్టు సిరీస్ గెలవలేదు. కాబట్టి.. ఈసారి మన జట్టు ఆ రికార్డును బ్రేక్ చేయాలని నేను అనుకుంటున్నా. అత్యుత్తమ ప్రదర్శనతో టీమ్‌ను గెలిపించాలని భావిస్తున్నా. వందకుపైగా మ్యాచ్‌లు ఆడిన నాకు జట్టులో చోటు దక్కకపోవడంతో బాధగా ఉంది. కానీ, నేను నిరుత్సాహపడడం లేదు. నన్ను నేను ప్రోత్సహించుకుంటూ సెలెక్లర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు పుజారా. 2010లో టెస్టు స్పెషలిస్ట్‌గా అరంగేట్రం చేసిన 103 టెస్టులు ఆడిన ఈ సౌరాష్ట్ర క్రికెటర్ 57,195 రన్స్ సాధించాడు.
గత ఏడాది నుంచి వన్డేలు, టీ20ల్లో భారత జట్టు అదరగొట్టింది. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం నిరాశపరిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం టీమిండియా స్టయిర్యాన్ని దెబ్బతీశాయి. అంతేకాదు వరుసగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి.. టెస్టు గదను ముద్దాడాలన్న కల కలగానే మిగిలిపోయింది. దాంతో, తర్వాతి సీజన్‌ను అయినా ఘనంగా ఆరంభించాలని భారత్ భావిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో విజయం సాధించి.. ఆత్మవిశ్వాసం నింపుకోవాలని అనుకుంటోంది. జూన్ 20న ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.