పాలమూరు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ( Grain purchase centres ) వద్ద రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) అన్నారు హన్వాడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెడుతున్నారు. కనీసం రైతులు ధాన్యం నింపుకునేందుకు సంచులు ఇవ్వడం లేదు. వర్షాలు పడుతుండటం తో ఎండిన ధాన్యం తడుస్తున్నది. కొన్ని చోట్ల వర్షం నీటికి ధాన్యం కొట్టుకు పోతున్నదని ఆయన అన్నారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు బంధు , రైతు భరోసా , చివరకు రైతు చనిపోతే బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కనీసం ధాన్యం అమ్మిన రైతుకు బోనస్ ఇవ్వకుండా బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వడగండ్ల వానకు నష్టపోయిన వరికి ఎకరాకు రూ. 40 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి అయితే పది శాతం కాలువల పనులకు టెండర్లను పిలిస్తే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంత రెడ్డి, మాధవులు తదితరులు పాల్గొన్నారు.