Srilanka Cricket | టీమిండియాతో టీ20 సిరీస్.. లంక సారథి అతడే..?
Srilanka Cricket: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన చరిత అలసంక (Charitha Asalanka) జాక్ పాట్ కొట్టాడు. శ్రీలంక టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Srilanka Cricket: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన చరిత అలసంక (Charitha Asalanka) జాక్ పాట్ కొట్టాడు. శ్రీలంక టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్వదేశంలో భారత జట్టుతో జరిగే మూడు టీ20 సిరీస్‌లో లంకకు అతడు సారథ్యం వహించనున్నాడు. మంగళవారం లంక క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga)సారథిగా వైదొలగడంతో సెలెక్టర్లు అసలంకకు బాధ్యతలు అప్పగించారు.
శ్రీలంక గడ్డపై భారత్ రెండు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. తొలుత టీ20, అనంతరం వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో టీమిండియా తలడపనుంది. ఈ సిరీస్ కోసం గౌతం గంభీర్ (Gautam Gambhir)నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది.
Sri Lanka announces the T20I squad for the India series, with Asalanka named as captain. #SLvIND pic.twitter.com/O5oeyFtLHU
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 23, 2024
శ్రీలంక స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ జతిన్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండీమాల్, దసున్ శనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ థీక్షణ, చమిందు విక్రమసింఘే, మథీశ పథిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో.
ఇరుజట్ల మధ్య జూలై 27న తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. వరల్డ్ కప్ హీరో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. హెడ్‌కోచ్‌గా తొలి పరీక్షకు సిద్ధమవుతున్న గంభీర్ ట్రోఫీతో సిరీస్ ముగించాలనే పనట్టుదలతో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
- Chandra Babu | హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుంది : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
- CM Revanth | సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నడుపాలంటే వణికిపోతున్నారు : మహేశ్వర రెడ్డి
- PM Modi | ఇది యువతరం కలలను నెరవేర్చే బడ్జెట్ : ప్రధాని నరేంద్రమోదీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

