PM Modi | ఇది యువతరం కలలను నెరవేర్చే బడ్జెట్ : ప్రధాని నరేంద్రమోదీ
PM Modi | ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని పొగిడారు.
PM Modi : ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని పొగిడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామని ఆయన వ్యాఖ్యానించారు.
మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉందని ప్రధాని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి తాము ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఎంప్లాయిమెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులకు తొలి జీతం తమ ప్రభుత్వమే ఇస్తుందని ఆయన తెలిపారు.
కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నామని, ఇంటర్న్‌షిప్ ద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని, ఇది యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. గ్రామ స్థాయి నుంచి మహానగరం వరకు ఆశావహులు అందిరినీ వ్యాపారవేత్తలను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచామని ప్రధాని తెలిపారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తున్నామని అన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

