అమరావతి : మాజీ మంత్రి వివేకానంద హత్యకేసు (Vivekananda Murder case ) అంశం ఏపీ అసెంబ్లీలో మరోసారి చర్చకు వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశం రెండోరోజున స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandra Babu) మాట్లాడుతూ గత వైఎస్ జగన్ (Jagan) పాలనలో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, అవమానాలు, హత్యా ఘటనలను వివరించారు. కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందా రెడ్డి దారుణ హత్యను ప్రస్తావించారు. హూ కిల్డ్ బాబాయి ఘటనను జగన్ ఎందుకు తేల్చలేకపోయారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని, సీబీఐపైనే ఎదురుదాడికి దిగారని ఆరోపించారు.
వివేకా హత్య జరిగాక ఘటనాస్థలికి వెళ్లిన సీఐ తన నివేదికను సీబీఐకి ఇచ్చే సమయంలో అతడికి ప్రమోషన్ ఇచ్చి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అనేక రకాలుగా అవమానపరిచారని, జైలులో బంధించారని అన్నారు. విశాఖలో రిషికొండపై నిర్మించిన అక్రమ కట్టడాల విషయంలో సభ్యుల సూచలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు.