పల్లెకెలె (శ్రీలంక): స్వదేశంలో భారత్తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టుకు చరిత అసలంక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్లో వనిందు హసరంగ దారుణ వైఫల్యంతో అతడు కెప్టెన్గా వైదొలగగా శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తాజాగా అసలంకకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈనెల 27, 28, 30న మూడు టీ20 మ్యాచ్లు జరుగుతాయి.