Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో ఐసీసీ ఈవెంట్లో దక్షిణాఫ్రికాలోకి బరిలోకి దిగనున్నది. గాయాలతో జాతీయ జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్లు లుంగీ ఎంగిడీ, అన్రిచ్ అన్రిచ్ నోర్ట్జేను సైతం ఎంపిక చేసింది. జట్టుల్లో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్సర్లకు అవకాశం ఇచ్చింది. బావుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలోనూ టీమ్ కప్ నెగ్గాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి గ్రూప్-బీలో ఉంది.
గత నెలలో అన్రిచ్ కాలికి గాయమైంది. దాంతో పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఎన్గిడీ సైతం గాయం కారణంగా శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన వన్డే దూరమయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది. ఆ సమయంలో జట్టు ప్రదర్శన అద్భుత ప్రదర్శన చేసింది. సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. ఆ టోర్నమెంట్లోనూ టెంబా బావుమా కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాంపియన్స్ ట్రోఫీకి సైతం బావుమానే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానున్నది. ప్రొటీస్ జట్టు తొలి మ్యాచ్‌ను 21న కరాచీలో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత 25న రావల్పండిలో ఆస్ట్రేలియాతో, మార్చి 1న ఇంగ్లాండ్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఉపఖండం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దక్షిణాఫ్రికా సెలెక్టర్లు ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఇటీవల గాయపడ్డ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ జట్టులో అవకాశం ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టులో వీలైనంత ఎక్కువ మంది ఆల్ రౌండర్లను ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే రీహాబిలిటేషన్‌లో ఉన్న వియాన్ ముల్డర్‌కు సైతం ఎంపిక చేసింది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో చేతికి గాయమైంది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. తాజాగా ఫియోజియో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. జట్టులో కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసి రూపంలో ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేయగా.. ఐడెన్ మార్క్రమ్ సహాయం చేయనున్నాడు. లుంగీ ఎన్గిడీ, అన్రిచ్ నోర్ట్జే, కసిగో రబాడా, ముల్డర్ ఫాస్ట్ బౌలర్ల కేటగిరిలో ఎంపిక చేసింది.
టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డీ జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడీ, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.