Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్‌తో నిరాశ పరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొననున్నది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నెల 22 ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు కోల్‌కతాలో జరుగనున్న క్యాంప్ కోసం పాండ్యా వెళ్లనుండగా.. రోహిత్ మాత్రం ముంబయి జట్టుతోనే కలిసి ఉంటాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. సెలెక్టర్లు ప్రస్తుతం టీమిండియా ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రోహిత్, పాండ్యా కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోహిత్ నెట్స్‌లో వైట్‌బాల్‌తో బ్యాటింగ్, హార్దిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ రోహిత్ కెరియర్లో కీలకంగా మారబోతుంది. సిరీస్‌లో హిట్‌మ్యాన్ విఫలమైతే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే వరుస టెస్టుల్లో టీమిండియా ఓటమి, ఫామ్ లేమితో రోహిత్ విమర్శలు ఎదుర్కొగా.. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముంబయి రంజీ జట్టుతో కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగే T20 సిరీస్‌కు ముందు భారత జట్టు కోల్‌కతాలో మూడు రోజుల శిబిరంలో పాల్గొంటుంది. సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీమిండియా.. ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. సూర్యకుమార్ నాయకత్వంలో శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై సిరీస్‌లను గెలిచింది.
Rohit Sharma & Hardik Pandya Practicing together ahead of Champions Trophy
📍 Reliance Corporate Park Navi Mumbai pic.twitter.com/QS6hm5kiEJ
— रॉयल चॅलेंजर्स बंगळुरू मराठी (@RCB_Marathi) January 16, 2025