Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రెడీ అయ్యింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో గురువారం తొలి మ్యాచ్ జరుగనున్నది. ఆటగాళ్లు ముమ్మరం ప్రాక్టీస్ చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఫామ్ భారత్‌కు కీలకం. ఈ క్రమంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. రెండో సెషన్లో ప్రాక్టీస్‌లో భారీ షాట్లు ఆడడంపై దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ కేఎల్ రాహుల్ కీపర్‌గా చేశాడు. సిరీస్ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సైతం.. కేఎల్ రాహుల్ చాంపియన్స్ ట్రోఫీలో కీపర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచుల్లో రాహుల్‌కు తుదిజట్టులో స్థానం దొరికింది. ప్రాక్టీస్ సెషన్లో దూకుడుగా షాట్లు ఆడడంపైనే దృష్టి పెట్టారు. మరో వైపు రిషబ్ పంత్ సైతం తుది జట్టులో సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 29 బంతుల్లో 40 పరుగులు చేసిన రాహుల్ దాదాపు ప్రతి బంతిలోనూ సిక్సర్లు కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. రాహుల్ ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఇటీవల శ్రేయాస్ అయ్యర్ సైతం బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. ఇంగ్లాండ్‌పై సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అద్భుతమైన డ్రైవ్‌లు, పుల్ సహా అద్భుత షాట్లు ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 119 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి తిరిగి వచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ సైతం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాయి. ఆదివారం శిక్షణ సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన బంతి షాట్ ఆడబోగా.. రిషబ్ పంత్ మోకాలికి తాకింది. దాంతో వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన సమయంలో.. బ్యాటింగ్‌లో ఆ లయ కనిపించలేదు. అయితే, రిషబ్ పంత్‌ను టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉపయోగించకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. స్పెషలిస్ట్ కీపర్‌గా రాహుల్ తుది జట్టులోకి వస్తే.. పంత్‌ను స్పెలిష్ట్ బ్యాట్స్‌మెన్‌గా తీసుకుంటారా? లేదంటే ఇంగ్లాండ్‌తో సిరీస్ తరహాలోనే బెంచ్‌కే పరిమితమవుతాడా? వేచి చూడాల్సిందే.