Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు.. సెకండ్ ఇన్నింగ్‌లో 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, అయ్యర్ వైఫల్యంపై మాజీ క్రికెటర్ బాలిస్ అలీ స్పందించాడు. అయ్యర్ అవుట్ చేయడం చాలా ఈజీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యర్‌ను త్వరగా ఎలా అవుట్ చేయాలో పాక్ టీమ్‌కు సలహా ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత జట్టు మ్యాచులన్నీ దుబాయి వేదికగా జరుగనున్నాయి. మిగతా మ్యాచులన్నీ పాక్‌లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి.
జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ షాట్ సెలక్షన్‌పై బాసిత్ అలీ విమర్శించాడు. మ్యాచ్‌లో వైడ్ మిడ్ ఆన్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ వేసిన ఫుల్లర్ డెలివరీని ఫీల్డర్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దారుణమైన విషయం ఏంటంటే.. ముంబయి ఇప్పటికే ఆరు వికెట్ల కోల్పోయిన సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అయ్యర్‌ను అవుట్ చేయడానికి ఇదే తేలికైన మార్గమని బాసిత్ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ చెత్త షాట్ ఆడాడని పేర్కొన్నారు. జట్లు కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్‌ను తరహాలో అవుట్ చేయవచ్చని పేర్కొన్నారు. హిట్టింగ్‌కు వెళ్లే సమయంలో మిడ్ ఆన్ బ్యాక్‌లో దొరకబుచ్చుకోవచ్చని పేర్కొన్నాడు.